ఎప్పుడో జరిగే పెళ్లికి అప్పుడే వేదిక ఫిక్స్ చేసుకున్న శ్రీదేవి కూతురు జాన్వి

  • ధడక్ చిత్రంతో పాప్యులారిటీ సంపాదించుకున్న జాన్వి
  • ఫొటో షూట్లతోనూ గుర్తింపు
  • తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని వెల్లడించిన యువతార
ధడక్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వి ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ఆమె ఒక్క సినిమాతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఫొటోషూట్లతో కూడా జాన్వి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్తులో జరగబోయే తన పెళ్లి గురించి మాట్లాడింది.

తాను తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. తన జీవితంలో అన్నీ సహజంగా జరగాలని కోరుకుంటానని తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాది స్పెషల్స్ ఉంటాయని మీడియా ప్రతినిధులకు నోరూరిపోయేలా లిస్టు చదివి వినిపించింది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, పని పట్ల నిబద్ధత ఉన్న వాడినే తాను మనువాడతానని జాన్వి పేర్కొంది.
Go Back to Shorts
Janhvi
Sridevi
Bollywood
Tirupati

More Telugu News